న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో వాహన, వ్యక్తిగత, గృహ రుణాలపై ఈఎంఐలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 8.60 శాతం నుంచి 8.70 శాతానికి చేరుకోనున్నది. పెరిగిన వడ్డీరేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయి.