BOB Tiara Credit Card | బ్యాంకు ఆఫ్ బరోడా అనుబంధ బీవోబీ కార్డు లిమిటెడ్.. మహిళల కోసం ప్రత్యేకంగా తియారా (TIARA) క్రెడిట్ కార్డు ఆవిష్కరించింది. ఈ క్రెడిట్ కార్డుతో ట్రావెల్, డైనింగ్, లైఫ్ స్టైల్ క్యాటగిరీల్లో పలు బెనిఫిట్లతోపాటు రివార్డు పాయింట్లు లభిస్తాయి. రూపే నెట్వర్క్పై పని చేస్తుందీ క్రెడిట్ కార్డు. తియారా (TIARA) క్రెడిట్ కార్డు దారులకు మైంత్రా, నైకా, ఫ్లిప్ కార్ట్, లాక్మే సలోన్, అర్బన్ కంపెనీల ఓచర్లు ఉచితంగా లభిస్తాయి. వీటితోపాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, గానా ప్లస్ సభ్యత్వం కూడా లభిస్తుంది. సినిమా టికెట్ల బుకింగ్ మీద డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఓచర్లు, మెంబర్ షిప్లు కలిపి రూ.31 వేల విలువపై బెనిఫిట్లు అందిస్తున్నట్లు బీఓబీ కార్డు లిమిటెడ్ వెల్లడించింది. జీఎస్టీతోపాటు రూ.2,499 చెల్లిస్తే ఈ కార్డు పొందొచ్చు. వార్షిక ఫీజు కూడా ఇంతే మొత్తం చెల్లించాల్సి ఉంటది. కార్డు తీసుకున్న 60 రోజుల్లో రూ.25 వేల విలువైన లావాదేవీలు జరిపితే జాయినింగ్ ఫీజు తిరిగి చెల్లిస్తారు. అలాగే ఏటా రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు కూడా రద్దు అవుతుంది.
ట్రావెల్, డైనింగ్, ఇంటర్నేషనల్ కొనుగోళ్లపై ప్రతి రూ.100లకు 15 రివార్డు పాయింట్లు, ఇతర లావాదేవీలపై ప్రతి రూ.100లకు మూడు రివార్డు పాయింట్లు లభిస్తాయి. ప్రతి బిల్లింగ్ సైకిల్ లో రూ.500 వరకూ జరిపే యూపీఐ లావాదేవీలకే రివార్డు పాయింట్లు కేటాయిస్తారు. ప్రతి మూడు నెలల గడువులో రూ.500 విలువ గల నైకా, మైంత్రా, ఫ్లిప్కార్ట్ ఓచర్లు, రూ.1500 విలువ గల లాక్మే సలోన్ ఓచర్ ఉచితంగా లభిస్తుంది.
ఉచితంగా అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, గానా ప్లస్ వంటి ఓటీటీ వేదికల వార్షిక సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. మూడు నెలలకోసారి బుక్ మై షోలో సినిమా టికెట్ బుకింగ్ పై రూ.250 డిస్కౌంట్ అందిస్తుంది. ఏడాదిలో మూడు నెలలు స్విగ్గీ వన్ మెంబర్ షిప్ ఇస్తారు. మూడు నెలలకో రూ.250 విలువ గల బిగ్ బాస్కెట్ ఓచర్ లభిస్తుంది. వీటితోపాటు హెల్త్ ప్యాకేజీ, రూ.10 లక్షల వరకూ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ, దేశీయ విమాన ప్రయాణాలకు అన్ లిమిటెడ్ లాంజ్ ఫెసిలిటీ, ఫ్యుయల్ సర్ చార్జి రద్దు వంటి సదుపాయాలు కల్పించారు.