క్యూ1లో రూ.1,209 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ, ఆగస్టు 7: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,208. 63 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది బ్యాంక్. గతే డాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌కు రూ.864 కోట్ల నష్టం వచ్చింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ. 20, 312.44 కోట్ల నుంచి రూ. 20,022.42 కోట్లకు తగ్గినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది బ్యాంక్. స్థూల నిరర్థక ఆస్తుల విలువ 9.39 శాతం నుంచి 8.86 శాతానికి తగ్గినప్పటికీ, నికర ఎన్పీఏ మాత్రం 2.83 శాతం నుంచి 3.03 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.4,111.99 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది.