తూప్రాన్, ఏప్రిల్ 12: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) భారత్‌లో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సేవల సంస్థ అని ఆ బ్యాంక్ జోనల్ హెడ్, చీఫ్ జనరల్ మేనేజర్ మన్మోహన్ గుప్త అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పోతరాజుపల్లి వద్ద బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ కొత్త కార్యాలయాన్ని ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. బ్రాంచ్‌లో ఏర్పాటు చేసిన ఏటీఎం, సర్వీస్ సిస్టమ్, ఆఫీస్ క్యాబిన్, లాకర్లను సందర్శించి, సలహాలు, సూచనలను చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించడమే బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్యమన్నారు. ఈ కొత్త శాఖతో తెలంగాణ నార్త్ రీజియన్ వ్యాప్తంగా బీవోబీ శాఖల సంఖ్య 57కు చేరిందన్నారు. ఖాతాదారుల ప్రయోజనార్థం బ్యాంకు యాప్ కూడా అందుబాటులో ఉందన్నారు. రూ. 20లకే సంవత్సరం పొడవునా రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నామని తెలిపారు. ఇంటి నుంచే సులభంగా బ్యాంకు సేవలను పొందవచ్చన్నారు. ఆరు నెలల పాటు వినియోగదారుడిగా ఉన్న ఖాతాదారుడికి ఎన్నో రకాల సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల అనంతరం బ్యాంకు లావాదేవీలను బట్టి బీవోబీ యాప్ ద్వారా రూ. 5 లక్షల వరకు పరన్సల్ లోన్ పొందవచ్చని తెలిపారు. క్రెడిట్ కార్డు సైతం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జోన్ ఎన్డీ జీఎం గోవింద్ ప్రసాద్‌వర్మ, తెలంగాణ నార్త్ రీజియన్ హెడ్ సీవీఎస్ చంద్రశేఖర్, తూప్రాన్ శాఖ బ్రాంచ్ మేనేజర్ నరేంద్ర గుండేటిలు పాల్గొన్నారు.
బీవోబీ వడ్డీరేట్లను పెంచింది. ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. బుధవారం నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన రుణాలపై మాత్రమే ఈ వడ్డీరేటు వర్తించనున్నదని పేర్కొంది. దీంతో ఒక్క రోజు రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.95 శాతానికి, ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.60 శాతానికి సవరించింది. మిగతా రుణాలపై వడ్డీరేటును యథాతథంగా ఉంచడం విశేషం.
నమస్తే తెలంగాణ: తూప్రాన్‌లో ప్రారంభించిన శాఖ ఎన్నోది?
మన్మోహన్: తెలంగాణ నార్త్ రీజియన్‌లో తూప్రాన్‌లో ఏర్పాటు చేసింది 57వ శాఖ. హైదరాబాద్ జోన్లో ఇది 400వ శాఖ. బ్రాంచి ప్రారంభానికి ముందే సుమారు రెండు వందల అకౌంట్లు ఓపెన్ చేయడానికి ఖాతాదారులు ముందుకు రావడం చాలా గొప్ప విషయం.
జవాబు: ఖాతా ప్రారంభించిన ఆరు నెలల్లోపు సిబిల్ స్కోర్‌ను బట్టి క్రెడిట్ కార్డును అందజేస్తాం. బీవోబీ మొబైల్ యాప్ ద్వారా ఆరు నెలలు లావాదేవీలను బట్టి రూ.5 లక్షల రుణాన్ని ఒకే క్లిక్ ద్వారా పొందవచ్చును. అలాగే ఏడాదికి రూ. 20 చెల్లించి రూ. 2 లక్షల బీమాను పొందవచ్చు. ఈ తరహా సేవలు ఏ బ్యాంకులో లేవు.
జవాబు: మిగతా బ్యాంకులతో పోలిస్తే బీవోబీలో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.
ప్రశ్న: ఎలాంటి రుణాలు ఇస్తున్నారు?
జవాబు: దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకైన బీవోబీ అన్ని రకాల రుణాలు ఇస్తున్నది. ముఖ్యంగా రైతు రుణాలతో పాటు బంగారం, వాహనాలు, వ్యాపార, వ్యక్తిగత, గృహ రుణాలు అందిస్తున్నాం.