జడ్చర్లలో బాలాక్సీ ఫార్మా ప్లాంట్
‘తెలంగాణలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉన్నది. మాకిది కేవలం ఓ ఉత్పాదక కేంద్రమే కాదు అంతకంటే ఎక్కువ. నిజంగా బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్‌కు ఇదో మైలురాయిగానే చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి వివిధ దేశ, విదేశీ మార్కెట్లకు ఔషధాల సరఫరా జరుగుతుంది.
- రూ.85 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సంస్థ
‘తెలంగాణలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉన్నది. మాకిది కేవలం ఓ ఉత్పాదక కేంద్రమే కాదు అంతకంటే ఎక్కువ. నిజంగా బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్‌కు ఇదో మైలురాయిగానే చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి వివిధ దేశ, విదేశీ మార్కెట్లకు ఔషధాల సరఫరా జరుగుతుంది. కొత్త ఉత్పత్తుల పరిచయానికీ ఈ ప్లాంట్ వేదిక కానున్నది’
-ఆశిష్ మహేశ్వరీ, బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఎండీ
హైదరాబాద్, డిసెంబర్ 14: ప్రముఖ ఐపీఆర్ బ్రాండెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఓ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నది. రూ.85 కోట్ల పెట్టుబడితో ఈ ఉత్పాదక కేంద్రాన్ని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భూమి పూజ జరుగగా, ఈ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ సదుపాయం.. మార్చి 2024కల్లా అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా కంపెనీ వర్గాలు వెల్లడించాయి. జూన్ నుంచి ఔషధాల సరఫరా కూడా ప్రారంభమవుతుందన్నాయి. కాగా, ఈ ప్లాంట్‌తో ఇప్పటికే ఉన్న మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని, ముఖ్యంగా ఐరోపా దేశాల మార్కెట్లలోకి ప్రవేశించడానికి వీలుంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
400 ఉద్యోగాలు
ఈ ప్లాంట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 400 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. యూఎస్ఎఫ్డీఏ, ఈయూజీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో జెనీ వా మార్గదర్శకాలకు అనుగుణంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని స్పెక్ట్రం ఫార్మాటెక్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. ముంబైకి చెందిన ఈ సంస్థే ప్లాంట్ డిజైన్, ఇంజినీరింగ్ పనులను చూసుకోనున్నది. ఇక సుమారు 1.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ సామర్థ్యం ఏటా 100 కోట్ల ట్యాబ్లెట్ల తయారీగా ఉంటుంది. అలాగే 50 కోట్ల క్యాప్సుల్స్, 2.7 కోట్ల లిక్విడ్ ఇంజెక్షన్లనూ తయారు చేయవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

