63 రెట్ల అధిక బిడ్డింగ్ దాఖలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థ బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ అదరగొట్టింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమైన సంస్థకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 63 రెట్ల అధిక బిడ్లు దాఖలయ్యాయి. అంటే ఐపీవోల చరిత్రలో ఇంతటి స్థాయిలో బిడ్లు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. వాటాల విక్రయం ద్వారా రూ.6,560 కోట్ల నిధులను సేకరించాలనుకున్న సంస్థకు రూ.3.2 లక్షల కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. అంటే జారీ చేసినదానికంటే 63.6 రెట్లు అధికంగా బిడ్లు దాఖలు కావడం విశేషం. మార్కెట్లో సెంటిమెంట్ బలంగా ఉండటం, ముఖ్యంగా రిటైల్ పెట్టుబడిదారులు అధికంగా బిడ్లు దాఖలు చేశారు. దేశ జీడీపీలో ఈ ఐపీవో వాటా ఒక్క శాతానికి పైగా ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను దేశ జీడీపీ రూ.295.36 లక్షల కోట్లుగా ఉన్నది.