న్యూఢిల్లీ, నవంబర్ 8: నాన్-బ్యాంకింగ్ సేవల సంస్థ బజాజ్ ఫైనాన్స్ భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. ఈ పండుగ సీజన్లో సంఖ్యపరంగా చూస్తే 27 శాతం వృద్ధిని సాధించిన సంస్థ..విలువ పరంగా చూస్తే మాత్రం 27 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 26 వరకు రూ.63 లక్షల రుణాలను మంజూరు చేయగా, అలాగే కొత్తగా 23 లక్షల మంది కస్టమర్లను ఆకట్టుకున్నట్టు కంపెనీ చైర్మన్ సంజీవ్ బజాజ్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు, ఆదాయ పన్నులో భారీ మార్పులు చేయడం దేశంలో వినియోగ-ఆధారిత ఉత్పత్తులకు గిరాకీ నెలకొన్నదన్నారు.