న్యూఢిల్లీ, జూన్ 8:మార్కెట్లోకి నయా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది బజాజ్ ఆటో. చేతక్ 2901 పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ధర రూ.95,998గా నిర్ణయించింది. ఈ ధరలు బెంగళూరు షోరూంనకు సంబంధించినవి. ఐదు రంగుల్లో లభించనున్న ఈ నయా మాడల్ అడ్వాన్స్ టెక్నాలజీతో తీర్చిదిద్దింది. సింగిల్ చార్జింగ్‌తో 123 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ సులువుగా ఎత్తైన గుట్టలు ఎక్కనున్నది. ఈవీ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నయా మాడల్‌ను తీర్చిదిద్దింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పెట్రోల్ స్కూటర్ ధర స్థాయిలోనే ఈ స్కూటర్ ధర ఉన్నదని, ఈ నెల 15 నుంచి విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.