న్యూఢిల్లీ, మార్చి 13: యోగా గురువు రామ్‌దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్, రజ్నీగంధా తయారీదారు ధరంపాల్ సత్యపాల్ గ్రూప్ (డీఎస్ గ్రూప్) కలిసి సనోటి ప్రాపర్టీస్ ఎల్ఎల్పీ అనుబంధ సంస్థ మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనున్నాయి. ఈ బీమా సంస్థను ఆదార్ పూనవాలా, రైజింగ్ సన్ హోల్డింగ్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కాగా, కంపెనీ విలువ రూ.4,500 కోట్లుగా నిర్ణయించి ఈ డీల్ జరుగుతున్నట్టు గురువారం వెలువడిన ఓ ప్రకటన చెప్తున్నది. షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రకారం మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌తోపాటు సెలికా డెవలపర్స్, జాగ్వార్ అడ్వైజరీ సర్వీసెస్ల అమ్మకానికి సనోటి ప్రాపర్టీస్ ఆమోదం తెలిపింది. రెగ్యులేటరీ అప్రూవల్స్కు లోబడి ఈ లావాదేవీ పూర్తి కానున్నది. వివిధ విభాగాల్లో మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ 70కిపైగా ప్రొడక్ట్స్‌ను అందిస్తున్నది. అన్ని ప్రధాన రిస్క్‌లకు బీమా కల్పిస్తున్నది.