హైదరాబాద్, సెప్టెంబర్ 18 : ఆజాద్ ఇంజినీరింగ్ మరో యూనిట్‌ను తెరిచింది. 7,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్‌కు సమీపంలోని తునికిబొల్లారంలో నెలకొల్పిన ఈ యూనిట్‌ను సిమెన్స్ ఎనర్జీ కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది.
ఈ యూనిట్లో లీన్‌ను తయారు చేయనున్నట్టు కంపెనీ చైర్మన్, సీఈవో రాకేశ్ చోప్దార్ తెలిపారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 150 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 230కి పెంచుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.