హైదరాబాద్, సెప్టెంబర్ 2: యాక్సిస్ ఎనర్జీ మరో అతిపెద్ద ప్రాజెక్టును దక్కించుకున్నది. ఆంధప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీల సంయుక్త సంస్థయైన ఎవ్రెన్ అభివృద్ధి చేస్తున్న 552 మెగావాట్ల పీక్ సౌర విద్యుత్ ప్రాజెక్టు ఈపీసీ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నట్టు యాక్సెస్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురళీ సూరపనేని తెలిపారు.
రాబోయే 18 నెలల్లో ఈ ప్రాజెక్టున ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు.