Axis Bank Fixed Diposits | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఆరు నెలల్లోపు గడువుతోపాటు రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లప వడ్డీరేట్లు పెంచేసింది. పెంచిన వడ్డీరేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని శుక్రవారం ప్రకటించింది. ఏడు రోజుల నుంచి ఆరు నెలల టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు తెలిపింది. ఏడు రోజుల నుంచి 29 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.50 నుంచి 2.75 శాతానికి వడ్డీరేటు పెరుగుతుంది. 30 రోజుల నుంచి మూడు నెలల్లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.25 శాతం, మూడు నెలల నుంచి ఆరు నెలల్లోపు ఎఫ్డీలపై 3.50 నుంచి 3.75 శాతానికి పెంచివేసింది యాక్సిస్ బ్యాంక్. ఇతర టెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.
తక్కువ టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీరేటు, ఎక్కువ టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది యాక్సిస్‌బ్యాంక్. ఒకవేళ మీరు ఎక్కువ ఆదాయం పొందాలని భావించినా, తక్షణ నిధుల అవసరం లేకున్నా.. అధిక టెన్యూర్‌తో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్స్కీం తెరవడమే పరిష్కారం.
60 ఏండ్లకు పైగా వయస్సు గల వృద్ధులకు రెగ్యులర్ డిపాజిటర్ల కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ వంటి కొన్ని ఎఫ్డీ పథకాల్లో అధిక మొత్తాలు మదుపు చేస్తే వడ్డీరేటు కూడా ఎక్కువే లభిస్తుంది.