‘అక్రమ కేసులను తక్షణం ఎత్తేయాలి’
అసెంబ్లీ గేటు ఎదుట జరిగిన ఉద్రిక్తత పరిస్థితులను బూచిగా చూపి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ శ్రేణులు మెరుపు ధర్నాకు దిగారు.
– ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి
– బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మద్దులపల్లిలో ధర్నా, అంబేద్కర్ విగ్రహానికి వినతి
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 08 : అసెంబ్లీ గేటు ఎదుట జరిగిన ఉద్రిక్తత పరిస్థితులను బూచిగా చూపి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ శ్రేణులు మెరుపు ధర్నాకు దిగారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ ధోరణి ఎండగడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను టార్గెట్ చేస్తూ రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుందని వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
అనంతరం సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి ప్రక్కనే గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల ముందు అమలు కానీ హామీలను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలకు ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పార్టీ తరఫున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండలం, ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- BRS
- Edulapuram
- khammam news
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Komrewar | పెన్షన్లు పెంచాలి.. రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి : కిరణ్ కొమ్రేవార్
Vrushakarma | నాగ చైతన్య ‘వృషకర్మ’ రన్టైమ్ 3 గంటలకు పైగానే .. థ్రిల్లర్ మూవీపై ఆసక్తికర ప్రచారం!
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలి : కలెక్టర్ అంకిత్
దీక్షా దివస్ను విజయవంతం చేయాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Sneha Shabarish | పిల్లలను ఎందుకు నిలబెట్టారు.. అధికారులకు కలెక్టర్ స్నేహ శబరీష్ వార్నింగ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

