ముంబై, జనవరి 26: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను రూ.7,010.65 కోట్ల నికర లాభాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,742.99 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5 శాతం ఎగబాకి రూ.14,287 కోట్లకు చేరుకున్నది.