హైదరాబాద్, మార్చి 18: అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ఆక్సియాడో.. భారత్‌లో తన వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్ కార్యాలయాన్ని మరింత విస్తరించబోతున్నది. వచ్చే ఏడాదిన్నరలోగా మరో 100 మంది టెక్నాలజీ నిపుణులను నియమించుకోనున్నట్లు ఆక్సియాడో సీఈ వో, ఫౌండర్ గోపి శ్రీ నేని తెలిపారు.
సిరీస్-సీలో భాగ ంగా నిధులను సమీకరించిన సం స్థ..వీటిని వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం భారత్‌తోపాటు తైవాన్లలో ఉన్న కార్యాలయాల్లో 150 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు.