హైదరాబాద్, డిసెంబర్ 26: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జీఆర్టీ జ్యువెల్లర్స్ మరో రెండు అవార్డులను చేజిక్కించుకున్నది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన నేషనల్ జ్యువెల్లరీ అవార్డు 14వ ఎడిషన్లో రెండు అవార్డులను సొంతం చేసుకున్నది. వీటిలో ఇయరింగ్ ఆఫ్ ది ఇయర్(రత్నాలు), ఇయరింగ్ ఆఫ్ ది ఇయర్(వజ్రం) విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయని కంపెనీ ఎండీ జీఆర్ రాధాకృష్ణన్ వెల్లడించారు. ఇలాంటి అవార్డులు రావడంతో బాధ్యత మరింత పెరిగిందని, దీంతో కస్టమర్లకు నచ్చిన విధంగా ఆభరణాలను డిజైనింగ్ చేసి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 65 షోరూంలు, సింగపూర్లో మరో షోరూం నిర్వహిస్తున్నది.