న్యూఢిల్లీ, మే 13: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిఖ ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.460.10 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.426.75 కోట్లతో పోలిస్తే 7.8 శాతం అధికంగా నమోదైంది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 20.57 శాతం పెరిగి రూ.10,594.11 కోట్లకు చేరుకున్నది.
నిర్వహణ ఖర్చులు రూ.8, 210.13 కోట్ల నుంచి రూ.10,002. 21 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదుకాలేకపోయిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.42,839.56 కోట్ల ఆదాయంపై రూ.2,378.34 కోట్ల నికర లాభాన్ని గడించింది. ప్రస్తుతం సంస్థ తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో 324 స్టోర్లు ఉన్నాయి.