న్యూఢిల్లీ, మే 11: ఆటో విడిభాగాల సంస్థ బాష్ గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది.
2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.350 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం గత త్రైమాసికానికిగాను 14 శాతం వృద్ధితో రూ.399 కోట్ల లాభాన్ని గడించింది. కంపెనీ ఆదాయం రూ.4,063 కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది.