Hero XPulse 210 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో శుక్రవారం తన హీరో ఎక్స్‌పల్స్ 210 (Hero XPulse 210) మోటార్ సైకిల్ని ఆవిష్కరించింది. దీని ధర రూ.1,75,800 పలుకుతుంది. ఎక్స్‌పల్స్200 (Hero XPulse 200) మోటార్ బైక్ స్థానే ఎక్స్‌పల్స్ 210 (Hero XPulse 210) మోటారు సైకిల్‌ను ఆవిష్కరిస్తున్నారని భావిస్తున్నారు. తొలిసారి గతేడాది ఈఐసీఎంఏ-2024లో ఈ మోటార్ సైకిల్ ఆవిష్కరించారు.
హీరో ఎక్స్‌పల్స్ 210 (Hero XPulse 210) మోటార్ సైకిల్ న్యూ210సీసీ, లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 24.6బీహెచ్పీ విద్యుత్, 20.7ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. జాతీయ రహదారులు, నగరాల్లో ఈ మోటారు సైకిల్ బాగా పని చేస్తుంది. ప్రస్తుత జనరేషన్ మోటార్ సైకిల్కంటే స్మూత్‌నెస్, ఫిట్నెస్తో ఉంటుంది.
హీరో ఎక్స్‌పల్స్ 210 (Hero XPulse 210) మోటార్ సైకిల్ సర్క్యులర్ ఎల్ఈడీ యూనిట్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, న్యూ ట్రాన్స్పరెంట్ విజర్, డ్యుయల్ స్పోర్ట్ డిజైన్, బీక్ లైక్ ఫ్రంట్ గార్డ్, ఫ్లాట్ సీట్, నకిల్ గార్డ్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. టర్న్ బై టర్న్ నేవిగేషన్, కాల్ అలర్ట్స్ నోటిఫికేషన్ల కోసం స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతోపాటు 4.2 అంగుళాల టీఎఫ్టీ కన్సోల్, ఎల్ఈడీ ఇల్యూమినేషన్ ఉంటాయి.
హీరో ఎక్స్‌పల్స్ 210 (Hero XPulse 210) మోటార్ సైకిల్ లాంగ్ ట్రావెల్ ఫ్రంట్ ఫోర్క్స్, మనోసాక్ ఉంటాయి. ప్రంట్లో 210ఎంఎం సస్సెన్షన్ ట్రావెల్ ఫోర్క్, రేర్‌లో 205 ఎంఎం బ్రేక్ ఉంటాయి. ఫ్రంట్ అండ్ రేర్‌లో డిస్క్ బ్రేక్ డ్యూటీస్ ఉంటాయి. ఆఫర్ మీద స్విచ్ఛబుల్ డ్యుయల్ చానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 220ఎంఎం అండ్ అడ్జస్టబుల్ హ్యాండిల్ బార్ ఉంటుంది.