హైదరాబాద్, మే 11: మాడ్యులర్ ఫర్నీచర్ తయారీ సంస్థ బ్లూమ్..తాజాగా హైదరాబాద్ తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. దక్షిణాదిలో తన వ్యాపార విస్తరణలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించినట్టు కంపెనీ ఎండీ నదీమ్ పాట్ని తెలిపారు.
తమకు నచ్చిన విధంగా కిచెన్, ఇతర ఫర్నీచర్‌ను తయారు చేసుకోవచ్చునని, కస్టమర్ అభిరుచులకు తగ్గట్టుగా ఈ సెంటర్ పనిచేయనున్నదన్నారు. అలాగే తెలంగాణలో తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో భవిష్యత్తులో ప్రతి జిల్లాల్లో ఒక సెంటర్‌తోపాటు త్వరలో హైదరాబాద్‌లో మరో ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఆరంభించబోతున్నట్టు ఆయన ప్రకటించారు.