హైదరాబాద్, మే 31: హైదరాబాద్‌కు చెందిన ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా.. మెదక్‌లోని తమ ప్లాంట్ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. బయోలాజిక్స్ తయారీ కాంట్రా క్ట్ కోసం ఫార్మా దిగ్గజం మెర్క్ షార్ప్ అండ్ ధోమ్ (ఎంఎస్డీ) సింగపూర్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో తమ అనుబంధ సంస్థ తేరానిమ్ బయోలాజిక్స్ మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు శుక్రవారం అరబిందో వివరించింది. ఈ క్రమంలోనే రూ.1,000 కోట్ల పెట్టుబడులతో మెదక్ ప్లాంట్‌ను విస్తరిస్తున్నారు. ఏటా 25-30 మిలియన్ల వయల్స్ ఉత్పాదక సామర్థ్యంతో కొత్త ఉత్పాదక కేంద్రం ఏర్పాటు కానున్నట్టు అరబిందో రెగ్యులేటరీలకు తెలిపింది. కాగా, ఈ ప్లాంట్ నుంచి ఆయా ఉత్పత్తులను తయారుచేసి ఎంఎస్‌డీకి తేరానిమ్ సరఫరా చేయనున్నది.