హైదరాబాద్, మే 3: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మాకు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. క్యాన్సర్ వ్యాధిని కట్టడిచేసే జనరిక్ మందు ‘బోర్ట్జోమిబ్’కు అక్కడి మార్కెట్లో ఉత్పత్తి చేయడంతోపాటు విక్రయించే ప్రతిపాదనకు యూఎస్ హెల్త్ రెగ్యులేటరీ అనుమతినిచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇక్కడి మార్కెట్లో అరబిందో అనుబంధ సంస్థయైన యూగియా ఫార్మా స్పెషాల్టీ లిమిటెడ్ విక్రయించనున్నది. సింగిల్ డోస్ కలిగిన ఈ బోర్ట్జోమిబ్ ఇంజెక్షన్ 3.5 ఎంజీ/వైల్ రూపంలో లభించనున్నది.