Audi Q8 facelift | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా.. దేశీయ మార్కెట్లో తన క్యూ8 ఫేస్ లిఫ్ట్ (Audi Q8 Facelift) కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.1.17 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. రూ.5 లక్షలు చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. న్యూ ఎయిర్ ఇన్టేక్స్ అండ్ ఒక్టాగోనల్ ఇన్సర్ట్స్ కోసం రీషేప్డ్ ఫ్రంట్ గ్రిల్లె అండ్ బంపర్ జత చేశారు. రేర్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లో స్వల్ప మార్పులు చేశారు. లేసర్ అసిస్టెన్స్‌తో హెచ్డీ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ తో 2024 ఆడి క్యూ8 కారు వస్తోంది. ఇంటీరియర్ కలర్ ఆప్షన్లతోపాటు స్వల్పంగా విభిన్నంగా డిజైన్ సీట్లు అమర్చారు. ఎయిట్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లు, నాలుగు ఇంటీరియర్ ట్రిమ్ కలర్ ఆప్షన్లలో ఆడి క్యూ8 ఫేస్ లిఫ్ట్ కారు వస్తున్నది.
ఆడి క్యూ8 ఫేస్ లిఫ్ట్ కారు 3.0 లీటర్లు, వీ6 టర్బో పెట్రోల్ మోటార్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 340 బీహెచ్పీ, 500 ఎన్ఎం టార్క్ వెలువరించడంతోపాటు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. 48వీ మైల్డ్ హైబ్రీడ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.