Audi Q8 e-tron | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడీ’ త్వరలో భారత్ మార్కెట్లో విడుదల చేయనున్న 2023-క్యూ8 ఈ-ట్రోన్ (Q8 e-tron) ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) అండ్ స్పోర్ట్ బ్యాక్ టీజర్ రిలీజ్ చేసింది. వచ్చేనెల 18న ‘క్యూ 8 ఈ-ట్రాన్ (Q8 e-tron) ఎలక్ట్రిక్ ఎస్యూవీ కిట్’ ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసిందని సమాచారం.
ప్రస్తుతం మార్కెట్లో 95కిలోవాట్ల బ్యాటరీతో పని చేస్తున్న ఈ-ట్రాన్ కారు మార్కెట్లో అందుబాటులో ఉంది. కానీ రాబోయే క్యూ8 ఈ-ట్రాన్ (Q8 e-tron)) కారు 114 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్నదని ఆడీ ఇండియా చీఫ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
భారత్ మార్కెట్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలోనూ క్యూ8 ఈ-ట్రాన్ (Q8 e-tron) కారు ఆవిష్కరిస్తాం అని బల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు. భారత్ మార్కెట్లోకి పూర్తిగా ‘కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ)` క్యూ8 ఈ-ట్రాన్ కారు దిగుమతి చేసుకుంటామన్నారు. ఈ-ట్రాన్ 50, ఈ-ట్రాన్ 55, ఈ-ట్రాన్ స్పోర్ట్ బ్యాక్ 55, ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ ఎలక్ట్రిక్ కార్లు భారత్ మార్కెట్లో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుత ఈ-ట్రాన్ ఎస్యూవీ కారు పూర్తిగా అప్డేట్ చేసి, క్యూ8 ఈ-ట్రాన్ (Q8 e-tron) కారు భారత్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నారు. న్యూ హైటెక్ ఫీచర్లు, పలు కాస్మొటిక్ మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతేడాది నవంబర్‌లో క్యూ8 (Q8 e-tron) ఈ-ట్రాన్ గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించారు.
ఫ్రంట్‌లో డ్యుయల్ టోన్-ట్రాపెజోడల్ గ్రిల్లె (dual-tone trapezoidal grille), న్యూ 2డీ లోగో, రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్, అప్డేటెడ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. రేర్‌లో అప్డేటెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, బంపర్ వస్తాయి. బీ-పిల్లర్ పై ‘ఆడీ (AUDI)’ బ్యాడ్జింగ్తోపాటు న్యూ అల్లాయ్ ఫీచర్స్ కూడా ఉంటాయి.
ఆడీ క్యూ8 ఈ-ట్రాన్ (Audi Q8 e-tron) మూడు ఆప్షన్లు – 50, 55, టాప్ స్పెసిఫికేషన్ ఎస్క్యూ8 ఆప్షన్లలో లభిస్తుంది. క్యూ8 ఈ-ట్రాన్ ((Audi Q8 e-tron) 55 వేరియంట్ కారు సింగిల్ చార్జింగ్‌తో 582 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. స్పోర్ట్ బ్యాక్ కారు సింగిల్ చార్జింగ్‌తో 600 కి.మీ. దూరం, టాప్ స్పెషిఫికేషన్స్ గల ఎస్క్యూ8 సింగిల్ చార్జింగ్ తో 513 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. క్యూ8 ఈ-ట్రాన్ రెండు వేరియంట్లలో 95 కిలోవాట్ల కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
భారత్ మార్కెట్లో ఆడి ఇండియా కేవలం క్యూ8 ఈ-ట్రాన్ 50, క్యూ8 ఈ-ట్రాన్ 55 వేరియంట్లను మాత్రమే ఆవిష్కరిస్తుందని సమాచారం. ఈ రెండు కార్లతోపాటు 11 కిలోవాట్ల చార్జర్ అందజేస్తారు. ఈ కార్లు పూర్తిగా చార్జింగ్ చేయడానికి తొమ్మిది గంటలు పడుతుంది.
రెండు కార్లు పనోరమిక్ సన్ రూప్, ఆప్టికల్ 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యుయల్ స్క్రీన్ ఫర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉంటాయి.