Audi Q7 | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా (Audi India) తన 2024 – ఆడి క్యూ7 (Audi Q7) కార్ల బుకింగ్స్ ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు రూ.2 లక్షలు చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. ఆడి ఇండియా వెబ్సైట్ ద్వారా గానీ, ‘మైఆడి కనెక్ట్’ యాప్ ద్వారా గానీ బుక్ చేసుకోవాలని తెలిపింది. ఈ నెల 28న ఆడి క్యూ7 (Audi Q7) ఆవిష్కరించనున్నది. ఔరంగాబాద్ ప్లాంట్‌లో ఆడి క్యూ7 (Audi Q7) కారు తయారీ ప్రారంభిస్తుంది. రివైజ్డ్ ఫ్రంట్ ప్రొఫైల్, బోల్డ్ ఒక్టాగొనాల్ గ్రిల్లె విత్ వెర్టికల్ స్లాట్స్ తో 2024 ఆడి క్యూ7 (Audi Q7) వస్తుంది. ఇంకా రీఫ్రెష్డ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ విత్ రీపొజిషన్డ్ డీఆర్ఎల్స్, రీ వర్క్డ్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్, బేస్ వేరియంట్లో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, అప్పర్ ట్రిమ్స్‌లో 20-22 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. సఖీర్ గోల్డ్, వైటోమో బ్లూ, మైథోస్ బ్లాక్, సమురాయి గ్రే, గ్లేసియర్ వైట్ రంగుల్లో లభిస్తుందీ ఆడి క్యూ7 (Audi Q7).
ఆడి క్యూ7 (Audi Q7) ఇన్ సైడ్‌లో రిఫైన్డ్ అప్హోల్స్టరీ ఆప్షన్స్ – సెడార్ బ్రౌన్, సైజా బీగ్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, 8-ఎయిర్ బ్యాగ్స్, అప్ డేటెడ్ అడాస్ ప్యాకేజీతోపాటు పలు సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ వంటి థర్డ్ పార్టీ ఆప్ లను ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ అనుమతి ఇస్తుంది. ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ టెయిల్ గేట్ వంటి ఫీచర్లూ ఉంటాయి.
ఆడి క్యూ7 (Audi Q7) కారు 3.0 లీటర్ల వీ6 టీఎఫ్ఎస్ఐ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 340 హెచ్‌పీ విద్యుత్, 500 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 48 వోల్టుల మైల్డ్ హైబ్రీడ్ సిస్టమ్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ కేవలం 5.6 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. గరిష్టంగా గంటకు 250 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఆడి సిగ్నేచర్ క్వాట్ట్రో ఆల్ వీల్ డ్రైవ్, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది.