Ather 450 Apex | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఎథేర్ ఎనర్జీ (Ather Energy) తన ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘450 అపెక్స్’ స్కూటర్ని ఆవిష్కరించింది. దీని ధర రూ.1.89 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. 2023 డిసెంబర్ 19న ఈ-స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ.2,500 టోకెన్ సొమ్ము చెల్లించి ఈ-స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. 450 అపెక్స్ స్కూటర్ పై ఐదేండ్లూ లేదా 60 వేల కి.మీ బ్యాటరీ వారంటీ ఉంటుంది.
ఏథేర్ ఎనర్జీ పదో వార్షికోత్సవం సందర్భంగా పరిమిత యూనిట్లుగా ఎథేర్ 450 అపెక్స్ స్కూటర్లను ఆవిష్కరించినట్లు సంస్థ కో ఫౌండర్ తరుణ్ మెహతా తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ వరకూ కస్టమర్ల నుంచి వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా ఈవీ స్కూటర్లు ఉత్పత్తి చేస్తామని అన్నారు. వచ్చే మార్చి నుంచి ఈవీ స్కూటర్ల డెలివరీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఓలా ఎస్1 ప్రో స్కూటర్‌తో ఎథేర్ 450 అపెక్స్ పోటీ పడుతుందన్నారు. ఇండియం బ్లూ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 157 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ 5.45 గంటల్లో చార్జింగ్ అవుతుంది. ఏథేర్ గ్రిడ్ ఫాస్ట్ చార్జర్‌తో నిమిషానికి 1.5 కి.మీ/మినిట్ స్పీడ్ ను బట్టి చార్జింగ్ అవుతుంది.
సంప్రదాయ 125సీసీ పెట్రోల్ స్కూటర్‌తో పోలిస్తే ఏథేర్ 450 అపెక్స్ స్కూటర్ బెటర్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. 7.0 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తున్న ఏథేర్ 450 అపెక్స్ స్కూటర్ గరిష్టంగా 9.38 బీహెచ్పీ విద్యుత్, 26 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. గరిష్టంగా గంటకు 100 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 2.9 సెకన్లలో 40 కి.మీ వేగం అందుకుంటుంది. ఈ ఈవీ స్కూటర్ ఐదు రైడ్ మోడ్స్- ఎకో, రైడ్, స్పోర్ట్, రాప్, రాప్+ (న్యూ) మోడ్స్ లో లభిస్తుంది.