న్యూఢిల్లీ, జూలై 1: ఎలిక్ట్రిక్ స్కూటర్ల సంస్థ ఏథర్ ఎనర్జీ మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. 3.7 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 159 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఢిల్లీ షోరూంలో ఈ స్కూటర్ ధరను రూ.1,37,047గా నిర్ణయించింది. రెండేండ్ల క్రితం రిజ్టా స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ..మళ్లీ ఇదే సిరీస్‌లో భాగంగా నయా మాడల్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ రవ్నీత్ ఎస్ ఫోకేలా మాట్లాడుతూ..
ఇదొక ఫ్యామ్లీ స్కూటరని, గత మాడల్తోపోలిస్తే అతిపెద్ద సీట్ సైజు ఉండటంతో సరుకులను అధికంగా తీసుకువెళ్లడానికి వీలు పడనున్నదన్నారు. ఈ స్కూటర్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ అవుట్లెట్లలో ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించింది సంస్థ. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఈ నెల చివరి నుంచి డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. ఏడు అంగుళాల డీప్‌వ్యూ టీఎం డిస్ప్లే, ఎమర్జేన్సీ స్టాప్ సిగ్నల్, థెఫ్ట్ అలర్ట్, ఫైండ్ మై స్కూటర్, అలెక్సా స్కిల్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్కూటర్‌పై సంస్థ ఎనిమిదేండ్లు లేదా 80 వేల కిలోమీటర్ల వ్యారెంటీ ఇస్తున్నది.