Asian Share Market | ఆసియా స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా పతనమయ్యాయి. అమెరికా, చైనా మధ్య జరుగుతు టారిఫ్ వార్తో మరోసారి మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. చైనా ప్రకటించిన ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై 104శాతం భారీ సుంకాలను ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య యుద్ధం భయాల మధ్య ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ ప్రారంభంలోనే దాదాపు నాలుగు శాతానికిపైగా పడిపోయింది. అలాగే, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లు సైతం ప్రభావితమయ్యాయి. అంతకు ముందు అమెరికా మార్కెట్లు సైతం నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్అండ్ 500 మంగళవారం ప్రారంభంలోనే 4.1శాతం లాభాలను నమోదు చేయగా.. ఆ తర్వాత 1.6శాతం నష్టపోయింది. ఫిబ్రవరిలో రికార్డు స్థాయి నుంచి దాదాపు 19శాతానికి పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా 0.8శాతం తగ్గింది.
నాస్డాక్ కాంపోజిట్ 2.1 శాతం పతనమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా ప్రతీకార సుంకాలపై తీవ్రంగా స్పందించారు. అమెరికా తాజా సుంకాలపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే. ఇప్పటికే అమెరికా సుంకాలను పెంచితే.. తాము సైతం ప్రతీగా సుంకాలు పెంచుతామని చైనా ఇప్పటికే స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య టారిఫ్ వార్ కొనసాగుతుండడంతో మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నది. టోక్యోలో నిక్కీ 225 3.9 శాతానికి పైగా పడిపోయింది. పెరిగిన సుంకాలు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని వైట్ ప్రకటించిన తర్వాత ఆసియా మార్కెట్ పతనమైంది. టోక్యోలో సూచీలు 6 శాతం, పారిస్లో 2.5 శాతం, షాంఘైలో 1.6 శాతం పెరిగాయి. టోక్యోలోని నిక్కీ 225 ఇండెక్స్ 3.9 శాతానికి పైగా పడిపోయి.. ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. మార్కెట్ ప్రారంభమైన దాదాపు గంట తర్వాత 3.5 శాతం తగ్గి 31,847.40 చేరింది. ప్రస్తుతం 2.62 శాతం తగ్గి 32,147.04 వద్ద ట్రేడవుతున్నది. దక్షిణ కొరియా కోస్పి 1 శాతం తగ్గి 2,315.27 పాయింట్లకు చేరగా.. ఆస్ట్రేలియాలో ఎస్అండ్పీ-ఏఎస్ఎక్స్ 200 ఇండెక్స్ 2శాతం తగ్గి.. 7,359.30కి చేరుకుంది.