న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఏషియన్ పెయింట్స్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ డాని మరణించారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. 1968 నుంచి ఏషియన్ పెయింట్స్ నుంచి అసోసియేట్ కలిగిన ఆయన..కంపెనీ బోర్డు డైరెక్టర్‌గాను, వైస్ చైర్మన్ అండ్ ఎండీ, నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా విధులు నిర్వహించారు.
ఏషియ పెయింట్స్ వ్యవస్థాపకుల్లో ఆయన తండ్రి కూడా ఒకరు. మరోవైపు, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అశ్విన్ డాని నికర విలువ 7.7 బిలియన్ డాలర్లు(సుమారు రూ.64 వేల కోట్లు).