రూ.5.89 కోట్ల జీఎస్టీ ఎగవేత
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఎగవేసిన ఓ కంపెనీ నిర్వాకాన్ని వాణిజ్య పన్నుల శాఖ బట్టబయలు చేసింది. తప్పుడు వివరాలతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను క్లెయిమ్ సంబంధించి ఏఎస్ మెటో కార్పొరేషన్ సంస్థ రూ.5.89 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి మంగళవారం వెల్లడించారు.
- ఏఎస్ మెట్ కార్పొరేషన్ సీఈవో పీయూష్ ప్రవీణ్ చంద్ర అరెస్ట్
హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఎగవేసిన ఓ కంపెనీ నిర్వాకాన్ని వాణిజ్య పన్నుల శాఖ బట్టబయలు చేసింది. తప్పుడు వివరాలతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను క్లెయిమ్ సంబంధించి ఏఎస్ మెటో కార్పొరేషన్ సంస్థ రూ.5.89 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి మంగళవారం వెల్లడించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఈ కంపెనీ లావాదేవీలపై అనుమానం కలిగిందని, గతేడాది డిసెంబర్ 24, 26 తేదీల్లో ఆ కంపెనీ సీఈవో పీయూష్ ప్రవీణ్ చంద్ర మెహతా నివాసంలో సోదాలు నిర్వహించామని వివరించారు.
మే 2018 నుంచి అక్టోబర్ 2022 వరకు ఎంఎస్ పైపులు, టీఎంటీ బార్లు, టీఎంటీ రెబర్లు, సీఆర్ఎఫ్హెచ్ స్టీల్ కాయిల్స్ సరఫరా చేసినట్టు ఈ-వే బిల్లులు, ఇన్వాయిస్లు ఉన్నాయని, కానీ అందులో స్పష్టత లేదన్నారు. దీంతో ఆర్ఎఫ్ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) టెక్నాలజీ సహాయంతో పరిశీలించగా.. వస్తువుల ఇన్వాయిస్లు, ఈ-వే బిల్లుల ప్రకారం ఎక్కడా టోల్‌ప్లాజాలు, రింగ్‌రోడ్డులు దాటలేదని చెప్పారు.
తప్పుడు వివరాలతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను క్లెయిమ్ చేసినట్టు గుర్తించామని తెలిపారు. వస్తువులను ఎగుమతి చేసుకోకపోయినా చేసుకున్నట్టు తప్పుడు ఐటీసీని క్లెయిమ్ చేశారన్నారు. సరుకు రవాణా కోసం వినియోగించే వాహనాల స్థానంలో కార్లు, ప్యాసింజర్ ఆటోలు, వ్యాన్లు, ద్విచక్ర వాహనాల నంబర్లతో తప్పు డు ఇన్వాయిస్లు సృష్టించారని తెలిపారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 26న కంపెనీ సీఈవో పీయూష్‌పై వాణిజ్య పన్నుల శాఖ బేగంపేట డిప్యూటీ కమిషనర్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్టు శ్రీదేవి తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

