న్యూఢిల్లీ, డిసెంబర్ 3: స్పోర్ట్స్ బైక్ అప్రిలియా ఆర్ఎస్ 457 ధరను రూ.10 వేలు పెంచుతున్నట్లు పియాజియో వెహికల్ సంస్థ ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.
ఇటాలియన్ పియాజియో గ్రూపునకు చెందిన బ్రాండే అప్రిలియా. ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ బైకు రూ.4.2 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్నది.