Apple Discounts | యూనివర్సిటీ విద్యార్థుల కోసం గ్లోబల్ టెక్ దిగ్గజం ‘ఆపిల్ (Apple)’ అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. ‘బ్యాక్ టూ యూనివర్సిటీ 2023 క్యాంపెయిన్ (Back to University)` కింద ఐ-పాడ్లు, మాక్ బుక్స్, డెస్క్ టాప్ కంప్యూటర్లపై డిస్కౌంట్ల వర్షం కురిపించింది.
ఐ-పాడ్ ప్రో (11-అంగుళాలు), ఐ-పాడ్ ప్రో (12.9- అంగుళాలు), ఐమాక్ (24-అంగుళాలు)లు డిస్కౌంట్ రేట్లపై అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు సెలక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్కనుగుణంగా ఎయిర్ పాడ్స్ ఉచితంగా అందజేయనున్నది. ఆపిల్ కేర్ + ప్లాన్ (AppleCare+ plans) కింద విద్యార్థులకు 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫ్లైన్, ఆన్లైన్ చానళ్లలో ఈ డిస్కౌంట్లు లభిస్తాయి. ఆపిల్ బీకేసీ ( Apple BKC), ఆపిల్ సాకెట్ (Apple Saket), ఆపిల్ స్టోర్ ఆన్లైన్ (Apple Store Online) స్టోర్లలో జూన్ 22 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఈ ఆఫర్లు చెల్లుబాటు అవుతాయి.
11-అంగుళాల ఐపాడ్ ప్రో (iPad Pro 11-inch) అసలు ధర రూ.96,900 నుంచి రూ.76,900లకు, 12.9 అంగుళాల ఐపాడ్ ప్రో (12.9-inch iPad Pro) రూ.1,12,900 నుంచి రూ.1,02,900లకు అందిస్తోంది. ఐపాడ్ ఎయిర్ (iPad Air) ధర రూ.59,900 కాగా, రూ.54,900లకు లభిస్తుంది. వీటితోపాటు సెకండ్ జనరేషన్ ఆపిల్ పెన్సిల్ (Apple Pencil) ఉచితంగా అందిస్తున్నది.

13- అంగుళాల `ఎం1-పవర్డ్ మాక్ బుక్ ఎయిర్ (M1-powered MacBook Air 13-inch)’ అసలు ధర రూ.99,900 కాగా, రూ.89,900లకు సొంతం చేసుకోవచ్చు. 13- అంగుళాల `మాక్ బుక్ ఎయిర్ (ఎం2) (MacBook Air 13-inch (M2) రూ.1,29,900 నుంచి రూ.1,04,900 కాగా, 15-అంగుళాల (ఎం2) మాక్ బుక్ ఎయిర్ (MacBook Air 15-inch)` రూ.1,34,900 నుంచి రూ.1,24,900 లకు లభిస్తుంది.
13- అంగుళాల మాక్ బుక్ ప్రో (MacBook Pro 13-inch) పై ఆపిల్ ఎడ్యుకేషన్ డిస్కౌంట్ రూ.1,29,900 నుంచి రూ.1,19,900, 14 -అంగుళాల మాక్ బుక్ ప్రో (MacBook Pro 14-inch) రూ.1,99,900 నుంచి రూ.1,84,900, 16-అంగుళాల మాక్ బుక్ (16-inch MacBook Pro) రూ.2,49,900 నుంచి రూ.2,29,900లకు తగ్గించారు.
ఐపాడ్, మాక్ బుక్లతోపాటు ఐ-మ్యాక్ కంప్యూటర్ (iMac) ధర రూ.1,29,900 కాగా, రూ.1,24,900లకు తగ్గించింది ఆపిల్. మాక్ మినీ (Mac mini) ధర రూ.59,900 నుంచి రూ.49,900లకు కుదించారు. మాక్ బుక్ ఎయిర్, మాక్ బుక్ ప్రో, ఐమాక్ 24 కొనుగోలు చేసే కస్టమర్లకు ఆపిల్ ఉచితంగా థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ అందజేస్తుంది. మాక్ మినీతో సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ పంపిణీ చేస్తుంది.
ఐపాడ్, మాక్బుక్, ఐమాక్లతోపాటు విద్యార్థులకు ఆపిల్ కేర్+ ప్లాన్స్ (AppleCare+ plans) మీద 20 శాతం డిస్కౌంట్ అందిస్తున్నది. దీంతోపాటు ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ టీవీ + సబ్ స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితంగా పొందొచ్చు. మూడు నెలల తర్వాత ప్రతి నెలా స్పెషల్ స్టూడెంట్ రేట్ కింద రూ.59లకు ఈ ప్లాన్లు లభిస్తాయి. యూనివర్సిటీ విద్యార్థులు, టీచర్లు, స్టాఫ్ కూడా ఆపిల్ ఉత్పత్తుల కొనుగోలు డిస్కౌంట్ పొందాలంటే.. ఆపిల్ వెబ్సైట్లో వారి అర్హతలు తెలియజేయాల్సి ఉంటుంది.