శాన్ఫ్రాన్సిస్కో : యఆపిల్ వాచ్ సిరీస్ 7 ఆర్డర్లు ఈనెల 8 నుంచి ఓపెన్ అవుతాయని యాపిల్ ప్రకటించింది. తొలి ఆర్డర్లు వారం తర్వాత అక్టోబర్ 15న డెలివరీ అవుతాయని వెల్లడించింది. యాపిల్ వాచ్ సిరీస్ 7 ప్రారంభ ధర రూ 41,900 కాగా, యాపిల్ వాచ్ ఎస్ఈ రూ 29,900 నుంచి అందుబాటులో ఉంటుంది.
యాపిల్ వాచ్ సిరీస్ 3 ప్రారంభ ధర రూ 20,900. యాపిల్ వాచ్ సిరీస్ 7 రీఇంజనీర్డ్ ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్ప్లేతో పాటు అధిక స్క్రీన్ ఏరియా, పలుచని బోర్డర్తో ఆకట్టుకుంటుంది. మైండ్ఫుల్నెస్ యాప్, స్లీప్ రెస్పిరేటరీ రేట్ ట్రాకింగ్, తైచీ పిలేట్స్ వర్కవుట్ టైప్స్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ముందుకొచ్చింది. ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సర్, ఈసీజీ యాప్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సర్ యాప్ వంటి హెల్త్, వెల్నెస్ టూల్స్ ఉన్నాయి.