CERT-In on Apple | ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లాప్స్.. అలర్ట్ జారీచేసిన కేంద్రం
CERT-In on Apple | ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, హ్యాకింగ్ కు గురయ్యే ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెర్ట్-ఎన్ హెచ్చరికలు జారీ చేసింది.
CERT-In on Apple | ఆపిల్ ఉత్పత్తుల్లో తీవ్రమైన భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఐ-ఫోన్, ఐపాడ్, ఆపిల్ వాచ్ తదితర ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థ- కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) తెలిపింది. తత్ఫలితంగా హ్యాకర్లు ఆపిల్ ఉత్పత్తులను హ్యాక్ చేసి యూజర్ల డేటా తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ కాంపొనెంట్ కెర్నెల్తోపాటు వెబ్ కిట్ విడి భాగాల్లో లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ తెలిపింది. ఈ లోపాలను అడ్డం పెట్టుకుని యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరించే వీలు ఉందని పేర్కొంది. యూజర్ల వస్తువుల్లోకి మాల్వేర్ లింక్లు, మెసేజ్లు పంపి.. వారి డేటా తస్కరించే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. ఆపిల్ వాచ్లు, టీవీలు, ఐ-ఫోన్లు, మ్యాక్ బుక్స్ సాఫ్ట్ వేర్ల్లో లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ తెలిపింది.
మ్యాక్ ఓఎస్ వర్షన్ 12.7, మ్యాక్ ఓఎస్ 13.6, వాచ్ ఓఎస్ 9.6.3, వాచ్ ఓఎస్ 10.0.1, ఐఓఎస్ 17.0.1, ఐపాడ్ ఓఎస్ 17.0.1 ఓఎస్ల్లో లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ తెలిపింది. ఐ-ఫోన్ తాజా వర్షన్ ఓఎస్ ఐఓఎస్ 17.0.1 వర్షన్, ఆపిల్ సఫారీ వర్షన్ 16.6.1 లోనూ లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ పేర్కొనడంతో త్వరలో ఆపిల్ కొత్త ఓఎస్ అప్ డేట్ రిలీజ్ చేస్తుందని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

