Elon Musk-Apple | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల జెయింట్ టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను టెక్ దిగ్గజం ఆపిల్ నియమించుకున్నట్లు తెలుస్తోంది. టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌తో ఆ ఎగ్జిక్యూటివ్ విభేదించినట్లు వార్తలు వచ్చాయి. 2019 నుంచి టెస్లా ఆటో పైలట్ సాఫ్ట్వేర్ డైరెక్టర్‌గా పని చేసిన క్రిస్టోఫర్ సీజే మూర్.. తాజాగా ఆపిల్‌లో చేరారని బ్లూమ్ బర్గ్ న్యూస్ వార్తాకథనం.
సెల్ఫ్ డ్రైవింగ్ కారును మార్కెట్లోకి విడుదల చేయాలని ఆపిల్ కలలు కంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు .. ప్రాజెక్ట్ టైటాన్ అనే కోడ్ నేమ్ పెట్టింది ఆపిల్. సోషల్ మీడియా వేదిక లింక్డ్ఇన్లో క్రిస్టోఫర్ సీజే మూర్ ఖాతా ప్రకారం టెస్లాలో ఆయన ఏడేండ్ల ఐదు నెలలు పని చేశారు. 2014లో సీనియర్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్‌గా టెస్లాలో ఆయన చేరారు.
పూర్తిగా సెల్ఫ్ డ్రైవంగ్ కారు నడపడంపై ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ సదస్సులో టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ అభిప్రాయంతో మూర్ విభేదించారని మీడియాలో వార్తలొచ్చాయి. లెవెల్ 5 పూర్తి స్థాయి ఆటోమేటెడ్ సెల్ఫ్ డ్రైవింగ్ కారుపై టెస్లా అతిశయోక్తిగా వ్యవహరిస్తున్నారని మూర్ అన్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ పరంగా రియలిస్టిక్.. వాస్తవ పరిస్థితులకు సరిపోలదని మూర్ చెప్పారు.