శాన్ఫ్రాన్సిస్కో, జనవరి 13: యాపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనంలో భారీ కోత పడింది. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో ఈ ఏడాదికిగాను ఆయన వేతనం 40 శాతం లేదా 35 మిలియన్ డాలర్ల మేర తగ్గనున్నది.
అమెరికా సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్(ఎస్ఈసీ)కు సంస్థ ఇచ్చిన సమాచారం మేరకు 2023 ఏడాదికిగాను ఆయన 49 మిలియన్ డాలర్లు మాత్రమే వేతనం రూపంలో అందుకోనున్నారు. 2022లో ఆయన 84 మిలియన్ డాలర్లు పొందారు. గడిచిన సంవత్సరంలో ఈక్విటీల రూపంలో 75 మిలియన్ డాలర్లు అందుకున్న కుక్..ఈ ఏడాదికి గాను ఇది 40 మిలియన్ డాలర్లకు పడిపోనున్నది. అలాగే వార్షిక బేసిక్ వేతన రూపంలో 3 మిలియన్ డాలర్లు, వార్షిక నగదు రాయితీ కింద మరో 6 మిలియన్ డాలర్లు అందుకోనున్నట్లు తెలిపింది.