శుక్రవారం 23 అక్టోబర్ 2020
Business - Sep 19, 2020 , 01:08:53

23న ఆపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌

23న ఆపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌

న్యూఢిల్లీ: దేశీయ కస్టమర్లకు మరింత చేరువకావడానికి, ప్రస్తుత పండుగ సీజన్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రముఖ మొబైల్‌ సంస్థ ఆపిల్‌ వచ్చేవారంలో ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించబోతున్నది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టోర్లలో వినియోగదారులు ఎలా అనుభూతి పొందుతున్నారో..అదే అనుభూతిని భారత్‌ కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో ఈ స్టోర్‌ను ఈనెల 23న ఆరంభించబోతున్నట్లు  శుక్రవారం సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆన్‌లైన్‌ స్టోర్‌ను ఈ ఏడాదిలోనే, రిటైల్‌ స్టోర్‌ను వచ్చే ఏడాదిలో ప్రారంభించబోతున్నట్లు ఫిబ్రవరిలో కంపెనీ సీఈవో టీమ్‌ కుక్‌ ప్రకటించారు. దీనికి అనుగుణంగా సంస్థ ఈ ఆన్‌లైన్‌ స్టోర్‌ను ఆరంభించబోతున్నది. ప్రస్తుతానికి ఆపిల్‌ కంపెనీ తన ఉత్పత్తులను ఆన్‌లైన్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో విక్రయిస్తున్నది.


logo