హైదరాబాద్, ఫిబ్రవరి 14: ప్రస్తు త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.153 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది అపోలో హాస్పిటల్స్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.228.37 కోట్లతో పోలిస్తే 33 శాతం తగ్గినట్లు పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17 శాతం ఎగబాకి రూ.4,263.58 కోట్లకు చేరుకున్నది. నిర్వహణ ఖర్చులు రూ.4 వేల కోట్లకు చేరుకున్నాయి.