హైదరాబాద్, ఆగస్టు 21: అపోలో హాస్పిటల్స్లో ప్రమోటర్లు తమ వాటాను తగ్గించుకున్నారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సునీత రెడ్డి తన వాటాల్లో 1.25 శాతం వాటాను విక్రయించడంతో రూ.1,395 కోట్ల నిధులు సమకూరాయి. బ్లాక్డీల్ ద్వారా జరిగిన ఈ విక్రయంతో సంస్థలో సునీత రెడ్డి వాటా 3.36 శాతం నుంచి 2.11 శాతానికి తగ్గింది.
ఒక్కో షేరు రూ.7,747 చొప్పున 18 లక్షల షేర్లను విక్రయించది. ఇంట్రాడేలో రికార్డు స్థాయికి చేరుకున్న కంపెనీ షేరు చివరకు రూ.7,920 వద్ద ముగిసింది. తొలి త్రైమాసికానికిగాను రూ.5,842 కోట్ల ఆదాయంపై రూ.433 కోట్ల నికర లాభాన్ని గడించింది.