ముంబై: దేశంలోనే టాప్ బ్రాండింగ్ కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేసేందుకు సిద్ధమైంది. కొద్ది రోజుల కిందటే బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అండ్ కాస్మటిక్స్ ప్రొడక్ట్స్ కంపెనీ నైకా తరహాలో దీని అరంగేట్రం ఉంటుందని అభిప్రాయ పడుతున్నాయి. పెట్టుబడిదారుల నుంచి రూ.1,013 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు రెడీ అవుతోంది. ప్రముఖ ఫ్యాషన్ సంస్థ గో-ఫ్యాషన్ ఐపీఓకు సిద్ధమైంది. మహిళలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ను మార్కెటింగ్ చేసే సంస్థ కావడం వల్ల మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇదివరకు గో-కలర్స్ పేరుతో మార్కెట్లో చిరపరిచితమైన పేరు. అనంతరం ఇది గో ఫ్యాషన్‌గా పేరుమార్చుకున్నవిషయం తెలిసిందే. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా బ్రాంచెస్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్, మల్లీ పెక్స్,ఇలా అన్ని చోట్లా ఈ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది.
ఈ నెల 17వ తేదీన దీనికి సంబంధించిన పబ్లిక్ ఇష్యూ జారీ అవుతుంది. 22వ తేదీన ముగుస్తుంది. గో ఫ్యాషన్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ.655 నుంచి 690 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఆసక్తి ఉన్నా వారు కనీసం 21 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 14,490 రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. 21 షేర్లను ఒక లాట్‌గా నిర్ధారించారు. గరిష్ఠంగా 13 లాట్స్‌ను రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చు.