హైదరాబాద్, డిసెంబర్ 28: రాష్ట్రవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది దేశంలో అగ్రగామి ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ). ఇప్పటికే తెలంగాణలో 94 బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా..త్వరలో మరో 264 స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఐవోసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్ బీ అనిల్ కుమార్ తెలిపారు. వీటితోపాటు ఇక్కడ 25 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను కూడా నెలకొల్పినట్లు చెప్పారు. అలాగే 46 రిటైల్ అవుట్లెట్ల వద్ద సీఎన్జీ కేంద్రాలను నెలకొల్పినట్లు, మరో 21 సీఎన్జీలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.