హైదరాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్‌గా బీ అనిల్ కుమార్ నియమితులయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలుగు రాష్ర్టాల ప్రధాన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవల పదవీ విరమణ చేసిన ఆర్ఎస్ఎస్ రావు స్థానంలో అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ అనిల్ కుమార్.. ఇండియన్ ఆయిల్ రిటైల్ సేల్స్ డిపార్టుమెంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జిగా విధులు నిర్వహించారు.