HomeBusinessAn Increasing Number Of Women Are Joining Corporate Boards
మహిళలదే హవా!
దేశీ కార్పొరేట్ వ్యవస్థలో నాయకత్వ హోదాల్లో మహిళల శాతం పెరుగుతోంది. కానీ బోర్డు చైర్పర్సన్లుగా నియమితులవుతున్న మహిళల శాతం తక్కువగా ఉంటోంది. డెలాయిట్ గ్లోబల్ విడుదల చేసిన తాజా నివేదిక వివరాలు...
డైరెక్టర్లు 17%, చైర్మన్లు 3.6%
కార్పొరేట్ బోర్డుల్లో పెరుగుతున్న సంఖ్య
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశీ కార్పొరేట్ వ్యవస్థలో నాయకత్వ హోదాల్లో మహిళల శాతం పెరుగుతోంది. కానీ బోర్డు చైర్పర్సన్లుగా నియమితులవుతున్న మహిళల శాతం తక్కువగా ఉంటోంది. డెలాయిట్ గ్లోబల్ విడుదల చేసిన తాజా నివేదిక వివరాలు…
ప్రతీ కంపెనీ బోర్డులోనూ ఒక మహిళ నియామకాన్ని తప్పనిసరిచేస్తూ 2013 కంపెనీల చట్టాన్ని సవరించింది. ఈ నేపథ్యంలో 2014లో 9.4 శాతంగా ఉన్న మహిళా డైరెక్టర్ల శాతం 2021లో 17.1 శాతాన్ని మించింది.
కానీ 3.6 శాతం మంది మహిళలు మాత్రమే చైర్పర్సన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంఖ్య 2018 తర్వాత 0.9 శాతం మేర తగ్గింది.
అంతర్జాతీయంగా బోర్డు స్థానాల్లో 19.7 శాతం మంది మహిళలు ఉన్నారు.
ఆస్ట్రియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్, యూకే, యూఎస్ల్లో కార్పొరేట్ బోర్డుల్లో మహిళల సంఖ్య పెరిగింది.
ప్రపంచం మొత్తం మీద మహిళా సీఈవోల శాతం 4.7కు పెరిగింది. 2018లో ఇది 3.4 శాతమే.
మహిళా సీఈవోలు ఉన్న బోర్డుల్లో మహిళా డైరెక్టర్ల సంఖ్య కూడా అధికంగానే ఉన్నది.
పురుషులు సీఈవోలుగా ఉన్న కంపెనీల బోర్డ్ల్లో 19.4 శాతం మహిళా డైరెక్టర్లు ఉండగా, మహిళా సీఈవోలు నేతృత్వం వహిస్తున్న బోర్డుల్లో వీరి సంఖ్య 30.8శాతం.