హైదరాబాద్, మార్చి 6:ఖనిజ దిగ్గజం ఎన్ఎండీసీ నూతన సీఎండీ గా అమితవ ముఖర్జీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కంపెనీ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయననే పూర్తి స్థాయి సీఎండీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన గురువారం పదవిబాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో ఫిబ్రవరి 29, 2028 వరకు కొనసాగనున్నారు. నవంబర్ 2018 నుంచి ఎన్ఎండీసీ డైరెక్టర్(ఫైనాన్స్)గా బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖర్జీకి మార్చి 2023లో సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది కేంద్రం.