హైదరాబాద్, నవంబర్ 20: అమెరికాకు చెందిన మరో టెక్నాలజీ దిగ్గజం తెలంగాణలో అడుగపెట్టింది. తాజాగా సోనోకో ప్రొడక్ట్స్ కంపెనీ నూతన కార్యాలయాన్ని తెరిచింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో హోవార్డ్ కూకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో పెట్టుబడులు నిరంతరంగా కొనసాగించనున్నట్టు, ఇక్కడ ప్రతిభ కలిగిన ఐటీ ఉద్యోగులు అత్యధికంగా లభించడంతోపాటు ఇన్నోవేషన్ కేంద్రంగా ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం ఈ సెంటర్ 145 మంది ప్రొఫెషనల్స్ విధులు నిర్వహిస్తుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను భారీగా పెంచుకునే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ టెక్నాలజీ కార్యకలాపాల్లో హైదరాబాద్ సెంటర్ కీలక పాత్ర పోషించనున్నదన్నారు.