హైదరాబాద్, నవంబర్ 13: అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ సేవల సంస్థ బ్లాక్‌బడ్.. తాజాగా హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. గడిచిన ఏడాదిగా భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థకు ఇదే తొలి ఆఫీస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు ఇన్నోవేషన్, ఏఐ ఇంటగ్రేషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ సేవలు అందించడానికి ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి కెవిన్ గ్రెగోయిర్ తెలిపారు.
ప్రపంచస్థాయి ప్రతిభా వ్యవస్థ కలిగిన నగరంలో ఈ టెక్నాలజీ సెంటర్‌తో అంతర్జాతీయ లీడర్‌గా ఎదిగేందుకు దోహదపడనున్నదన్నారు.