హైదరాబాద్, సెప్టెంబర్ 30: అమెరికాకు చెందిన బీమా సంస్థ ది హార్ట్ఫోర్డ్..హైదరాబాద్లో నూతన టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇన్నోవేషన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సెంటర్ను నెలకొల్పినట్టు కంపెనీ సీఐవో శేఖర్ పన్నాలా తెలిపారు.
1810 సంవత్సరంలో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం ఫార్చ్యూన్ 200 కంపెనీల్లో ఒకటిగా నిలువగా, అంతర్జాతీయంగా 19 వేల మంది సిబ్బంది ఉన్నారు.