Reliance | సెమీ కండక్టర్ల రంగంలోకి రిలయన్స్.. విదేశీ సంస్థలతో చర్చలు?!
Reliance | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీపై ఫోకస్ చేస్తున్నది. భాగస్వామ్య సంస్థల కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
Reliance | కార్లు మొదలు స్మార్ట్ ఫోన్లు (Smart Phones), కంప్యూటర్లు (Computers), ఎలక్ట్రానిక్ పరికరాల (Electronic Devises) తయారీలో సెమీ కండక్టర్ చిప్ (Semi Conductor Chip)లు కీలకం. వాటి సరఫరా కోసం చైనా (China), తైవాన్ (Taiwan)పైనే ఆధార పడాల్సి వస్తున్నది. సరఫరాలో కొరత కారణంగా కార్ల తయారీలో జాప్యం కూడా జరుగుతున్నది. రోజురోజుకు దేశీయంగా సెమీ కండక్టర్ల (Semi Conductor) కు గిరాకీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries).. సెమీ కండక్టర్ల (Semi Conductor) ను తయారు చేసేందుకు గల అవకాశాలపై ఫోకస్ చేసిందని సమాచారం.
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో విదేశీ చిప్ మేకర్ల (Semi Conductor) తో రిలయన్స్ (Reliance) సంపద్రింపులు జరుపుతున్నది. సెమీ కండక్టర్ల (Semi Conductor) తయారీలో టెక్నాలజీ (Technology) భాగస్వాములయ్యేందుకు అవకాశం గల సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని పేర్కొంది. ఇందుకు నిర్దిష్ట గడువేదీ లేదని కూడా రిలయన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. సెమీ కండక్టర్ల (Semi Conductor) రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నదే తమ అభిమతం అని రిలయన్స్ (Reliance) వర్గాలు చెబుతున్నాయి.
ఏయే విదేశీ సంస్థలతో సంప్రదించారన్న సంగతి కూడా రిలయన్స్ వెల్లడించలేదు. దీనిపై కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ (Union Electronics and IT Ministry) గానీ, ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయం (Prime Minister Narendra Modi Office) గానీ స్పందించడానికి ముందుకు రాలేదు. వేదాంతా (Vedanta), తైవాన్ ఫాక్స్‌కాన్ (Foxconn) వేర్వేరుగా దేశంలో సెమీ కండక్టర్ల (Semi Conductor) సంస్థలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్ పరిధిలో సెమీ కండక్టర్ల (Semi Conductor) తయారీకి అవసరమైన లోహ నిల్వలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో దేశీయంగా సెమీ కండక్టర్ల (Semi Conductor) తయారీ పరిశ్రమ స్థాపనకు ప్రయత్నాలు జోరందుకుంటున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

