బాలుడిని చంపి.. అవయవాలు అమ్మేందుకు యత్నం
ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నాలుగేండ్ల బాలుడిని చంపి అవయవాలు అమ్మేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. జష్పూర్ జిల్లాలోని సన్నా గ్రామానికి 2025లో రామ్‌జీత్ వలసవచ్చి ఓ గుడిసెలో నివసిస్తున్నాడు. అతని నాలుగేండ్ల కొడుకును వరుసకు మేనమామ అయ్యే చల్నీ గ్రామానికి చెందిన గొర్రపాత్ బసుదేవ్ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు.
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నాలుగేండ్ల బాలుడిని చంపి అవయవాలు అమ్మేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. జష్పూర్ జిల్లాలోని సన్నా గ్రామానికి 2025లో రామ్‌జీత్ వలసవచ్చి ఓ గుడిసెలో నివసిస్తున్నాడు. అతని నాలుగేండ్ల కొడుకును వరుసకు మేనమామ అయ్యే చల్నీ గ్రామానికి చెందిన గొర్రపాత్ బసుదేవ్ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు.
నవంబర్ 5 నుంచి బాలుడు కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బసుదేవ్ మీద అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపేసినట్టు అంగీకరించాడు. బాలుడిని చంపేసి ఊపిరితిత్తులు, కిడ్నీలు, కండ్లు అమ్మేందుకు ప్రయత్నించానని తెలిపాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకే ఇలా చేశానన్నాడు. బాలుడి మృతదేహాన్ని ఓ నీటిగుంతలో పూడ్చిపెట్టినట్టు పోలీసులు గుర్తించి వెలికి తీశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

