సీఎం ప్రత్యేక పూజలు చూసి స్క్రీన్‌పైకి చెప్పులు విసిరిన భక్తులు
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రత్యేక పూజల కోసం ఆలయానికి వెళ్లగా, దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎంతో పాటు ఆయన భార్య పూజలు చేస్తున్న దృశ్యాలను ప్రసారం చేస్తున్న ఎల్ఈడీ స్క్రీన్‌పైకి చెప్పులు విసిరారు. దీపావళి సందర్భంగా ఆదివారం శివకుమార్ తన భార్యతో కలిసి హసన్ జిల్లాలోని ప్రసిద్ధ హసనాంబ ఆలయాన్ని సందర్శించారు.
- కర్ణాటకలోని హసనాంబ ఆలయంలో నిరసన సెగ
హసన్: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రత్యేక పూజల కోసం ఆలయానికి వెళ్లగా, దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎంతో పాటు ఆయన భార్య పూజలు చేస్తున్న దృశ్యాలను ప్రసారం చేస్తున్న ఎల్ఈడీ స్క్రీన్‌పైకి చెప్పులు విసిరారు. దీపావళి సందర్భంగా ఆదివారం శివకుమార్ తన భార్యతో కలిసి హసన్ జిల్లాలోని ప్రసిద్ధ హసనాంబ ఆలయాన్ని సందర్శించారు.
గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సాధారణ భక్తుల దర్శనం క్యూను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటికే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు మరింత ఇబ్బందులకు గురయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

